KRMB: బృందంలో తెలంగాణ వారు ఉండకూడదు: ఏపీ ప్రభుత్వం

ఆగస్టు 5వ తేదీన కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద ఏపీ ప్రభుత్వం

Updated : 03 Aug 2021 15:43 IST

హైదరాబాద్: ఆగస్టు 5వ తేదీన కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను బోర్డు ప్రతినిధులు పరిశీలించనున్నారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఏపీ సర్కార్‌ సూచించింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని