TS News: మల్లన్నసాగర్‌ స్వప్నం సాకారమైంది.. కేసీఆర్‌ కల నెరవేరింది: హరీశ్‌రావు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన భారీ రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది.

Updated : 24 Sep 2022 17:14 IST

సిద్దిపేట‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన భారీ రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా కాళేశ్వరం కాలువ నుంచి నీటిని జలాశయంలోకి మళ్లిస్తున్నారు. దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కల నెరవేరిందని ట్వీట్‌ చేశారు. మల్లన సాగర్‌ స్వప్నం సాకారం అయిందన్న మంత్రి.. తెలంగాణ రైతులు ఆనందంతో మురిసిపోతున్నారని తెలిపారు. పట్టుదలతో పని చేస్తే సాధ్యం కానిదే లేదని తెలంగాణ ప్రభుత్వం చాటిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ట్రయల్‌ రన్‌లో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ శివారులో పంప్‌ హౌస్‌లో ఎనిమిది భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ, ఎల్లంపల్లి, మధ్యమానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ల ద్వారా కొమురవెల్లి మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తారు. 50 టీంఎసీల సామర్థ్యంలో చేపట్టిన ఈ జలాశయంలో ఈ ఏడాది 10 టీఎంసీలు నిల్వ చేస్తారని సమాచారం. ప్రధాన నదులపై కాకుండా నీటిని మళ్లించి నిల్వ చేసుకునే రిజర్వాయర్‌లలో రాష్ట్రంలో ఇదే పెద్దది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు