హైదరాబాద్‌లో కూలిన పురాతన భవనం

నగరంలోని పాత మలక్‌పేటలో ఓ పురాతన భవనం పాక్షికంగా కూలిపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీటికి నాని భవనం మొదటి అంతస్తు కొంత భాగం

Updated : 14 Jul 2021 19:32 IST

హైదరాబాద్: నగరంలోని పాత మలక్‌పేటలో ఓ పురాతన భవనం పాక్షికంగా కూలిపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీటికి నాని భవనం మొదటి అంతస్తు కొంత భాగం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకున్నారు. ఒక వైపు పురాతన భవనాలను కూల్చివేయాలని కోర్టులు చెబుతున్నప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పురాతన భవనాలను గుర్తించి తక్షణం కూల్చి వేయాలని స్థానికులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు