Ap News: డిగ్రీ ప్రశ్నా పత్రం లీక్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రశ్నా పత్రం లీకేజీ కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లెలో బీకాం ఆరో సెమిస్టర్‌ అకౌంట్స్‌ మేనేజింగ్‌ అకౌంటింగ్‌...

Updated : 29 Sep 2021 16:39 IST

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రశ్నా పత్రం లీకేజీ కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లెలో బీకాం ఆరో సెమిస్టర్‌ అకౌంట్స్‌ మేనేజింగ్‌ అకౌంటింగ్‌ పరీక్ష ప్రశ్నా పత్రం లీకైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేనేజింగ్‌ అకౌంటింగ్‌ పరీక్ష జరగాల్సి ఉంది. ఇవాళ ఉదయం 11.42 గంటలకే లీకైన ప్రశ్నా పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ నెల 23 నుంచి ఎస్‌వీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వర్సిటీ పరిధిలోని 112 కళాశాలల్లో పరీక్షలు జరుగుతుండగా.. 73 వేల మంది డిగ్రీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 25 వేల మంది చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని