TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను వెల్లడించారు...

Updated : 25 Aug 2021 12:37 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్.. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి  సబిత మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌లో 82.08 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఎంసెట్‌ను 9 విడతల్లో నిర్వహించామన్నారు. పరీక్షకు హాజరు శాతం పెరిగిందని వివరించారు. గతంతో పోల్చుకుంటే 28 వేల మంది విద్యార్థులు అదనంగా హాజరయ్యారని చెప్పారు. కరోనా సమయంలోనూ షెడ్యూల్ పూర్తి చేసిన అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని