AP EAPCET: అగ్రికల్చర్‌, ఫార్మసీలో టాప్‌ టెన్‌ ర్యాంకర్లు వీరే..

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇది వరకే ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల కాగా..

Updated : 14 Sep 2021 22:24 IST

అమరావతి: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇది వరకే ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల కాగా.. ఇవాళ అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్‌కు మొదటి ర్యాంకు, అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయకు రెండో ర్యాంకు, హనుమకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్‌రావుకు మూడో ర్యాంకు, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన గజ్జల సమీహనరెడ్డి నాలుగు, ప్రగతి నగర్‌కు చెందిన కాసా లహరికి ఐదో ర్యాంకు కైవసం చేసుకున్నారు.

గుంటూరుకు చెందిన కాశీందుల చైతన్య కృష్ణ ఆరో ర్యాంకు, ఏడో ర్యాంకును గుంటూరులోని గోరంట్లకు చెందిన నూతలపాటి దివ్య, ఎనిమిదో ర్యాంకును సిద్దిపేట జిల్లాకు చెందిన కల్యాణం రాహుల్‌ సిద్ధార్థ్‌, తొమ్మిదో ర్యాంకును నల్గొండకు చెందిన తడిసిన సాయి రెడ్డి, పదో ర్యాంకును గుంటూరుకు చెందిన గద్దె విదీప్‌ సొంతం చేసుకున్నారు. జిల్లాల వారీగా టాప్‌ టెన్‌ ర్యాంకర్ల వివరాలను కూడా వెల్లడించారు. 

జిల్లాల వారీగా టాప్‌ టెన్‌ ర్యాంకర్ల వివరాల కోసం క్లిక్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని