
TTD: 35 రోజుల టికెట్లు.. 30 నిమిషాల్లోనే హుష్!
తిరుమల: శ్రీవారి సర్వదర్శనం అక్టోబర్ నెల కోటా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా.. ఊహించని రీతిలో అరగంటలోపే అవి ఖాళీ అయ్యాయి. రోజుకు 8వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లను 30 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు.
గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని జియో సహకారంతో ఆ సంస్థ సర్వర్లను వినియోగించి టికెట్లను విడుదల చేశారు. తితిదే వెబ్‌సైట్‌కు ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగినా సర్వర్లపై ఒత్తిడి పడకుండా వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లను కేటాయించారు. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ లేదా దర్శనానికి 72 గంటల ముందు పరీక్ష చేసుకున్న కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లతో తిరుమలకు రావాలని తితిదే సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.