Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Apr 2024 13:10 IST

1. ఈ రాయి డ్రామాకు ఎవరిని బలి చేస్తారో: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

సీఎం జగన్‌ది మరో కోడికత్తి డ్రామా అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. కొత్త నాటకానికి ఆయన తెరలేపారని విమర్శించారు. విజయవాడలో సీఎం జగన్‌పైకి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఆయన నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులో ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి కథనం

2. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు.. వాళ్ల కుట్రలను అర్థం చేసుకోవాలి: కేటీఆర్‌

ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.పూర్తి కథనం

3. సార్వత్రిక ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా

సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ (BJP Manifesto) పేరుతో భాజపా (BJP) మేనిఫెస్టోను విడుదల చేసింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ దీన్ని ఆవిష్కరించారు.పూర్తి కథనం

4. నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబయిలో సల్మాన్‌ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ముందు ఈ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు.పూర్తి కథనం

5. రంగంలోకి అమెరికా.. ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా ఉంటామన్న బైడెన్

ఇరాన్‌(Iran)-ఇజ్రాయెల్‌ (Israel) మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి. ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తాజాగా ప్రకటించారు. ‘‘భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని నేను నెతన్యాహుకు తెలిపాను.పూర్తి కథనం

6. జీ-మెయిల్‌లో లార్జ్‌ ఫైల్స్‌ను సెండ్‌ చేయడం ఎలా?

నిత్యం వినియోగించే ఇ-మెయిల్‌ సేవల్లో జీ-మెయిల్‌ (Gmail) ముందు వరుసలో ఉంటుంది. గూగుల్‌కు చెందిన ఈ సేవల్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తుంటారు. క్వాలిటీ మిస్‌ కాకుండా ఫొటోలు పంపాలన్నా, ముఖ్యమైన ఫైల్స్‌, డాక్యుమెంట్లు సెండ్‌ చేయాలన్నా జీ- మెయిల్‌నే ఎక్కువమంది వాడుతుంటారు.పూర్తి కథనం

7. తాటిముంజెలు... కోటి లాభాలు!

ఎండాకాలపు ఉక్కపోతలు ఎంతలా ఇబ్బంది పెట్టినా... వేసవి వడగాలులు విలవిలలాడిపోయేలా చేసినా... సూర్యుడి ప్రతాపం మనల్ని మరెంత తాపానికి గురిచేసినా... వాటిని కాస్త మరిపించేవి- ఈ కాలంలోనే దొరికే ప్రత్యేకమైన పండ్లు. పూర్తి కథనం

8. అంబేడ్కర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అంబేడ్కర్‌ అందించిన సేవలను నేతలు కొనియాడారు.పూర్తి కథనం

9. వేసవిలో ఈవీల వినియోగం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీటిని భరించే ఓపికలేని ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వేసవి కాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చితే.. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయి.పూర్తి కథనం

10. సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన.. కేంద్ర ఎన్నికల సంఘం ఆరా

సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని