Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Nov 2021 13:22 IST

1. TS News: కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు: కిషన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణకు కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్‌ నిన్న, మొన్న నిర్వహించిన మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు, ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Amaravati Padayatra: ఒక రోజు విరామం తర్వాత ‘అమరావతి మహాపాదయాత్ర’ ప్రారంభం 

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్ర ఒక రోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర.. తొమ్మిదో రోజైన ఇవాళ ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు 10.5 కిలోమీటర్ల మేర సాగనుంది. జై అమరావతి అంటూ నినాదాల మధ్య పాదయాత్ర ముందుకు కదులుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు ఇంకొల్లు ప్రాంత రైతులు, స్థానికులు సంఘీభావం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద తెదేపా నిరసనలు

3. Suriya: బయోపిక్‌ల బాస్‌.. నటనకు కేరాఫ్‌.. సూర్య!

మరుగున పడ్డ రియల్‌ హీరోల కథలను తెరపై చూపిస్తూ హిట్‌ కొడుతున్నారు రీల్‌ హీరోలు. ఈ ఒరవడిలో వచ్చిందే ‘జై భీమ్‌’. తెలుగువాళ్లకీ దగ్గరైన తమిళ హీరో సూర్య.. జస్టిస్‌ చంద్రు పాత్రలో జీవించేశాడు. ఇదొక్కటే కాదు.. తను బయోపిక్‌ల బాస్‌. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిన పలు పాత్రల్లో మెప్పించాడు. ఆ వివరాలు.. పద్దెనిమిదేళ్ల కిందట వచ్చిన మణిరత్నం దృశ్యకావ్యం ‘ఆయుథ ఎజుత్తు’ చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Lac: చైనా విషయంలో భారత్‌.. ఏమాత్రం తగ్గేదేలే..!

వాస్తవాధీన రేఖ వద్ద సంక్షోభం రెండో ఏడాది పూర్తి చేసుకునే దిశగా వెళుతోంది. భారత సైన్యం చైనాతోపాటు శీతాకాలాన్ని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు చకచక ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక్కడ శీతాకాలంలో దాదాపు మైనస్‌ 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న తప్పు చేసినా.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.  ఇప్పటికే భారీ సంఖ్యలో ఎల్ఏసీ వద్ద దళాలు మోహరించాయి. భారత్‌-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Sapphire Foods IPO: కేఎఫ్‌సీ, పిజ్జాహట్‌లో వాటాలు కొంటారా?
ఎఫ్‌సీ, పిజ్జా హట్‌ వంటి ప్రముఖ ఆహార సంస్థల్ని నిర్వహిస్తున్న సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నేడు ప్రారంభమైంది. ఈ నెల 11న ముగియనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో ఉన్న వాటాలన్నీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద వస్తున్నవే కావడం గమనార్హం. ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన మొత్తం 1,75,69,941 షేర్లను విక్రయించనున్నారు. దీంట్లో 75 శాతం షేర్లను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌(క్యూఐబీ), 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషినల్‌ బయ్యర్స్‌, మిగలిన 10 శాతం వాటాలను రిటైల్‌ మదుపర్లకు అందుబాటులో ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. China: ఈ డబ్బులు తీసుకోండి.. కరోనా మూలం ఎక్కడో చెప్పండి..!

చైనా మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంది. మూడింట రెండొంతుల రాష్ట్రాల్లో వందల మంది వైరస్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్‌-జీరో వ్యూహంతో ముందుకెళ్తోన్న ఆ దేశానికి తాజా విజృంభణ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వుహాన్‌లో మహమ్మారి తొలిసారి వెలుగుచూసినప్పటి కంటే ఇప్పుడే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో చైనా వ్యాప్తంగా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరమయ్యాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: మళ్లీ వణికిస్తున్న మహమ్మారి..  రష్యా, జర్మనీ, చైనాలో కేసులు పైపైకి..

7. Tulsi Gowda: ‘తులసి’ కోటలో విరిసిన ‘పద్మం’..!

రాష్ట్రపతి భవన్‌లోని పద్మ అవార్డుల ప్రదానోత్సవం సమయంలో తులసి గౌడ అని పేరు పిలవగానే.. సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ వస్తుంటే.. దర్బార్‌ హాల్‌లోని కళ్లన్నీ ఆమెవైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాయి. ఆమెను చూడగానే అడవి తల్లికి ఆడబిడ్డ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. ఏ క్షణాన ఆమెకు ‘తులసి’ అని పేరుపెట్టారో గానీ, ఆ పేరుకు తగ్గట్లుగా ఆమె జీవితం కూడా ప్రకృతితో మమేకమైంది. సాధారణంగా రాణులు కోటలు కడతారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Kodali Nani: భాజపాతో పొత్తా.. పవన్‌కు సిగ్గులేదా?: కొడాలి నాని

బద్వేలు ఉప ఎన్నికలో వైకాపాకు 90వేలకు పైగా మెజార్టీ వచ్చిందని.. భాజపాకు ప్రజలు గడ్డి పెట్టారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. భాజపా నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. భాజపాపై పెట్రోల్‌.. తెదేపాపై డీజిల్‌ పోసి జనం తగులబెట్టారు. జనసేన పలికిమాలిన పార్టీ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్న భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు పవన్‌ కల్యాణ్‌కు సిగ్గు లేదా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Virat Kohli: కోహ్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: సెహ్వాగ్‌

 జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చిన విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. చాలాకాలంగా అతడు గొప్పగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో కోహ్లి బ్యాటింగ్‌ స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని సెహ్వాగ్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Xi Jinping: జీవితకాల అధినాయకుడిగా జిన్‌పింగ్‌! 

చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ మూడోసారీ అధ్యక్ష పగ్గాలను చేపట్టనున్నారా..? జీవితకాలం డ్రాగన్‌ దేశానికి ఆయనే అధినేతగా ఉండనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న జిన్‌పింగ్‌.. తన అధికారాన్ని శాశ్వతం చేసుకొనే దిశగా పావులు కదుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: పెళ్లి పేరుతో 19 మంది మహిళలకు మోసం.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని