Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 18 May 2023 17:18 IST

1. గొర్రెలు, బర్రెలు తప్ప.. బీసీలకు సీఎం కేసీఆర్ ఏం ఇచ్చారు?: బండి సంజయ్‌

రాష్ట్రంలోని బీసీలకు గొర్రెలు, బర్రెలు తప్ప సీఎం కేసీఆర్‌ ఏం ఇచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.5 వేల కోట్లు  మాత్రమే కేటాయించారని తెలిపారు. హైదరాబాద్‌ నాగోలులోని శుభం కన్వెన్షన్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన భాజపా ఓబీసీ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా పలువురు బీసీ ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇవేం ఉత్తర్వులు.. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు అంశంలో సీజేఐ అసహనం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్‌ రద్దు చేసి జూన్‌ 30 తర్వాత మళ్లీ బెయిల్‌ ఇవ్వాలని వెంటనే ఉత్తర్వులు ఇవ్వడంపై సీజేఐ ఆశ్చర్యం వెలిబుచ్చారు.  ఇవేం ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ ముగ్గురి కెప్టెన్సీలోనూ ఆడా.. ఎవరి నాయకత్వం ఎలా ఉంటుందంటే?: కేఎల్ రాహుల్

కాలికి గాయం కారణంగా ఐపీఎల్‌ (IPL 2023) సీజన్‌ నుంచి మధ్యలోనే వైదొలిగిన టీమ్‌ఇండియా ఆటగాడు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ రెగ్యులర్‌ సారథి కేఎల్ రాహుల్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు తరఫున ముగ్గురు కెప్టెన్ల సారథ్యంలో ఆడటంపై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనే కేఎల్ రాహుల్‌ జట్టులోకి వచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్ ‘తీర్పు’.. తలవంచిన వీరవిధేయుడు: డీకే శివకుమార్‌ ప్రస్థానమిదీ..

‘‘కోర్టులో మనం ఎంతైనా వాదిస్తాం. కానీ చివరకు న్యాయమూర్తి చెప్పింది పాటించాల్సిందే. హైకమాండ్‌ ఆదేశం కూడా నాకు కోర్టు తీర్పులాంటిదే’’.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక తర్వాత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చెప్పిన మాటలివి. అవును మరి.. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న డీకే.. అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలకు తలవంచి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు అంగీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎంగా సిద్ధరామయ్యే.. డీకేకు డిప్యూటీ పదవి: కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన

కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister) ఎంపికలో ఐదు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్యను కాంగ్రెస్‌ ఎంచుకుంది. ఇక, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను ఖరారు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం గురువారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఏఐసీసీ నిర్ణయాన్ని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తమిళనాడు (Tamil Nadu) సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu) విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. జల్లికట్టుపై తమిళనాడు చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రైతు కుటుంబంలో పుట్టి.. స్వయం కృషితో రెండు సార్లు సీఎంగా..!

కర్ణాటకలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. రాష్ట్రంలో పాపులర్‌ నేతగా ఉన్న సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ఐదేళ్ల విరామం తర్వాత కన్నడ సీఎం పీఠంపై మరోసారి సిద్ధరామయ్య ఆశీనులు కానున్నారు. ఈ మేరకు సిద్ధూ తన కొత్త జట్టుతో కలిసి మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కిరణ్‌ రిజిజుపై.. అందుకే వేటుపడిందా..?

కేంద్ర న్యాయశాఖ మంత్రి (Law Minister)గా పనిచేసిన కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను ఆ బాధ్యతలనుంచి తప్పించి.. భూ విజ్ఞానశాస్త్ర శాఖ (Ministry of Earth Sciences) మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే, కిరణ్‌ను తప్పించడానికి కారణాలు ఏమైనా.. ఆయన న్యాయవ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నేను పారిపోను.. చివరి శ్వాస వరకు నా దేశంలోనే: ఇమ్రాన్‌ ఖాన్‌

పాకిస్థాన్‌(Pakistan) విపత్తు వైపు వెళ్తోందని, దేశం విచ్ఛిన్నం కావొచ్చని మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. ఈ రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికలు నిర్వహించడమే మార్గమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 15 లక్షల బెలూన్లతో ప్రపంచ రికార్డుకు యత్నం.. డామిట్‌ కథ అడ్డం తిరిగింది!

అమెరికాలోని (America) క్లీవ్‌లాండ్‌లో 1986 సంవత్సరంలో ఓ భారీ బెలూన్‌ ఫెస్ట్‌కు (Balloonfest) ప్రణాళిక రచించారు. ఒకేసారి 15 లక్షల హీలియం బెలూన్లను గాల్లోకి వదిలి యునైటెడ్ వే ఆఫ్‌ క్లీవ్‌ల్యాండ్‌ అనే స్వచ్ఛంద సంస్థకు నిధులు సేకరించాలని అనుకున్నారు. ఈ బెలూన్‌ ఫెస్ట్‌ను లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన ఓ కంపెనీ సమన్వయం చేసింది. ఇది విజయవంతం అయితే క్లీవ్‌లాండ్‌కు మంచి గుర్తింపు లభిస్తుందని అంతా భావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని