Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 06 Feb 2024 21:15 IST

1. Congress: కేసుల కోసమే జగన్‌, విజయసాయి భాజపాకు లొంగారు: మాణికం ఠాగూర్‌

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. తనపై అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Nadendla manohar: వైకాపా అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు: నాదెండ్ల మనోహర్‌

శేషాచలం అడువుల్లో విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ముఠాలను వైకాపా పెంచి పోషిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ (పీఏసీ) నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. పాలకపక్షం అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారన్నారు. అన్నమయ్య జిల్లాలో కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన దుర్మార్గపు ఘటన వెనక ఎవరున్నారో వెల్లడి కావాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాళేశ్వరం, మేడిగడ్డ గురించి కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు: మంత్రి ఉత్తమ్

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవడం.. కేసీఆర్‌కు తెలిసినట్లుగా తమకు తెలియదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం.. మేడిగడ్డ మీద కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. TDP: జగన్ ఎమ్మెల్యేలను బదిలీ చేస్తే.. వారు ఓట్లు బదిలీ చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా రూపకల్పనలో భారీగా అవకతవకలు జరిగాయని.. వాలంటీర్ల సాయంతో తెదేపా సానుభూతిపరుల ఓట్లను తొలగించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఈ అంశాలపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో బీసీ జనగణన పేరుతో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Uttarakhand: సహజీవనాన్ని రిజిస్టర్‌ చేసుకోకుంటే.. ఆరు నెలల జైలు శిక్ష..!

వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేసేందుకు.. ఉత్తరాఖండ్ సర్కార్ సిద్ధమైంది. సహ జీవనంలో పుట్టిన పిల్లలకు కూడా చట్టపరమైన గుర్తింపును కల్పించడం.. సహ జీవనాన్ని రిజిస్టర్‌ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. YSRCP: వైకాపా ప్రచారానికి ప్రభుత్వ సొమ్ము..?

ప్రభుత్వం వేరు. పార్టీ వేరు. ఇది అందరికీ తెలిసిన ప్రాథమిక సూత్రం. కానీ.. సీఎం జగన్‌.. పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు ప్రభుత్వ సొమ్మునే వాడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం వినియోగిస్తున్నారు. వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో జనాన్ని తరలిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ECI: శరద్‌ పవార్‌కు షాక్‌.. అజిత్‌ వర్గమే అసలైన ఎన్సీపీ

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP)లో నెలకొన్న వివాదాన్ని ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఎన్‌సీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Triangular love story: ముక్కోణపు ప్రేమకథకు.. 5స్టార్‌ హోటల్‌లో ముగింపు!

ఓ ముక్కోణపు ప్రేమ కథ (Triangular love story)..5 స్టార్‌ హోటల్‌లో ముగిసింది. ఇద్దరితో ప్రేమ వ్యవహారం సాగించిన యువతి.. పరిస్థితులు వ్యతిరేకంగా మారడంతో పక్కా ప్లాన్‌ ప్రకారం అందులో ఒకరిని కడతేర్చింది. ఇందుకు ఆమె మరో ప్రియుడు కూడా సహకరించాడు. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Tata group: టాటా గ్రూప్‌ ఘనత.. మార్కెట్‌ విలువ ₹30 లక్షల కోట్లు

ప్రముఖ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌ (Tata group) అరుదైన ఘనత సాధించింది. దేశీయ కంపెనీల్లో ఏ కంపెనీ ఇప్పటివరకు అందుకోని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి గ్రూప్‌ మార్కెట్‌ విలువ (market cap) రూ.30 లక్షల కోట్లు దాటింది. ఇటీవల కాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, టాటా మోటార్స్‌, టాటా పవర్‌, ఇండియన్‌ హోటల్స్‌ షేర్లు రాణించడంతో.. టాటా గ్రూప్‌ ఈ రికార్డు అందుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Deepfake: సీఎఫ్‌ఓను క్లోన్ చేసి, రూ.200 కోట్లు కాజేసి..!

అత్యాధునిక సాంకేతికత లైఫ్‌స్టైల్‌ను సులభతరం చేసి, వావ్‌ అనిపిస్తోంది. అదే వాటిని దుర్వినియోగం చేస్తే ఆ స్థాయిలోనే ముప్పు పొంచి ఉంటుంది.  ఈ తరహాలో కొద్దికాలంగా డీప్‌ఫేక్‌(Deepfake) ఫొటోలు, వీడియోలు కలవరం సృష్టిస్తున్నాయి. హాంకాంగ్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ ఈ డీప్‌ఫేక్ బారినపడి ఏకంగా రూ.200 కోట్లు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని