Nadendla manohar: వైకాపా అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు: నాదెండ్ల మనోహర్‌

శేషాచలం అడువుల్లో విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ముఠాలను వైకాపా పెంచి పోషిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ (పీఏసీ) నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Updated : 06 Feb 2024 20:16 IST

అమరావతి: శేషాచలం అడువుల్లో విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ముఠాలను వైకాపా పెంచి పోషిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ (పీఏసీ) నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. పాలకపక్షం అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారన్నారు. అన్నమయ్య జిల్లాలో కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన దుర్మార్గపు ఘటన వెనక ఎవరున్నారో వెల్లడి కావాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కానిస్టేబుల్‌ గణేశ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

స్మగ్లర్లు ఇంతటి దురాగతానికి పాల్పడినప్పటికీ ఆ ముఠా వెనక ఎవరున్నారో పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటించడం పలు సందేహాలకు తావిస్తోందన్నారు. అటవీ శాఖ స్వాధీనంలో ఉన్న ఎర్రచందనాన్ని వైకాపా ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో సక్రమంగా విక్రయించలేకపోతోందని, స్మగ్లర్లు మాత్రం ఇష్టారాజ్యంగా సరిహద్దులు దాటించేస్తున్నారన్నారని పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు