Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Jun 2021 09:20 IST

1. పాత విద్యార్థులకు జేఈఈ మెయిన్‌ అవసరం లేదు

గత ఏడాది(2020)లో జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు రిజిస్టర్‌ చేసుకొని పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు ఈసారి 2021 అడ్వాన్స్‌డ్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మళ్లీ జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్‌డ్‌ 2021 నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐటీ ఖరగ్‌పుర్‌ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆ సంస్థ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సవరణ సమాచార పత్రాన్ని  ఆదివారం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నేడు లేదా రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల విడుదల

2. Britain: బ్రిటిష్‌ సైనిక రహస్యాలు బహిర్గతం!

బ్రిటన్‌ రక్షణ శాఖకు చెందిన కీలక, రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. గత మంగళవారం కెంట్‌ కౌంటీలోని ఓ బస్టాప్‌ వద్ద వీటిని ఓ పౌరుడు గుర్తించాడు. బ్రిటిష్‌ మిలటరీ, యుద్ధనౌకల సున్నిత సమాచారం ఆ పత్రాల్లో ఉందని ఆదివారం బీబీసీ మీడియా వెల్లడించింది. రక్షణ శాఖ సీనియర్‌ అధికారుల ఈమెయిల్స్‌, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు కూడా వాటిలో ఉన్నాయి. రక్షణ శాఖ కార్యాలయంలో కొన్ని కీలక పత్రాలు మాయమైనట్టు గత వారం ఉద్యోగి ఒకరు ఫిర్యాదు చేసి ఉండటంతో.. అవే ఇవని భావిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TS News: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసి తీరుతాం

రైతులకు ఇచ్చిన మాటకు తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని, రూ.లక్ష రుణ మాఫీ చేసి తీరుతామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో రూ.6.96 కోట్లతో నిర్మించిన తరగతి గదులు, మహిళా భవనాలు, రైతువేదికలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఇటిక్యాల గ్రామంలో వరి సాగులో వెదజల్లే పద్ధతికి శ్రీకారం చుట్టి స్వయంగా పొలంలోకి దిగి వరి విత్తనాలు చల్లారు. అనంతరం గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వైఎస్‌ఆర్‌ బీమా అమలు బాధ్యత సచివాలయాలకు!

4. TS News: కంటికి ఇంపు.. తింటే కంపు

రాజధానిలో ఆహార కల్తీ జోరుగా సాగుతోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లు భారీగా పెరిగాయి. అనధికారికంగా చాలా మంది బిర్యానీ కేంద్రాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు తెరిచారు. దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీసే రంగులు, కుళ్లిన మాంసాహారం, పాచిపోయిన కూరలను వేడి చేసి వినియోగదారులకు పంపిస్తున్నారు. ఇదేమీ తెలియని పౌరులు.. రాయితీలు ఇస్తున్నారన్న కారణంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భార రహిత స్థితిని సృష్టించే డ్రోన్లు

అంతరిక్ష కేంద్రాలు, వ్యోమనౌకలు, ఉపగ్రహాల్లోని పరిస్థితులను సిమ్యులేట్‌ చేసేందుకు ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు సరికొత్త అల్గోరిథమ్‌లను అభివృద్ధి చేశారు. బహుళ రెక్కల వ్యవస్థతో కూడిన డ్రోన్‌ల ద్వారా భారరహిత స్థితిని సృష్టించడానికి ఇవి వీలు కల్పిస్తాయి. చంద్రుడు, అంగారకుడిపై ఉండే పరిమిత గురుత్వాకర్షణ పరిస్థితులనూ సిమ్యులేట్‌ చేయగలవు. తద్వారా భూమిపైనే సంబంధిత ప్రయోగాలను నిర్వహించడానికి వీలవుతుంది. రోదసిలో ఉండే భారరహిత స్థితి..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* డ్రోన్లతో.. భవిష్యత్తులో భద్రతకు పెనుముప్పు

6. Corona: కొత్తగా లాంబ్డా కలకలం!

కరోనా వైరస్‌లో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ‘దృష్టిసారించాల్సిన వైరస్‌ రకం’ (వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)గా ప్రకటించింది. బ్రిటన్‌లోని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌ఈ) కూడా దీన్ని ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించడం, దీని స్పైక్‌ ప్రొటీన్‌లో ఎల్‌452క్యూ, ఎఫ్‌490ఎస్‌ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* ఊపిరితిత్తుల కణజాలంతో మరింత ప్లస్‌!

7. భలే.. భలే.. బాహుబలి కప్పను నేను!

మాములుగా కప్పలు ఎంతుంటాయి.. మహా అయితే పెద్దవాళ్ల అరచేయంత ఉంటాయి.. అంటారేమో..! నేనైతే ఏకంగా చిన్న పిల్లాడంత ఉంటాను. అంత పెద్దగానా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! అవును మరి.. ఆ మాత్రం ఉంటాను కాబట్టే నా గురించి మీతో చెప్పుకొందామని  ఇదిగో ఇలా వచ్చాను.  ఇంకెందుకాలస్యం నా విశేషాలేంటో తెలుసుకుందామా!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రేవంత్‌ ముందు సవాళ్లెన్నో

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కొత్త కార్యవర్గం సవాళ్లపై నడక సాగించాల్సి ఉంది. వరుస ఓటములతో పాటు పలువురు ముఖ్య నాయకులు పార్టీని వీడటం వంటి సమస్యలతో కాంగ్రెస్‌ రాష్ట్ర కేడర్‌ సతమతమవుతోంది. పలు నియోజకవర్గాలు, జిల్లాల్లో నాయకత్వ సమస్య తీవ్రంగా ఉంది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లో ఓటమితో పాటు లోక్‌సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల కోటాలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ వెనుకబడింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* TS News: కాంగ్రెస్‌లో పీసీసీ కాక

9. SMA: ఏడాది చిన్నారి ఊపిరి నిలిపిన అదృష్టం

ఎస్‌ఎమ్‌ఏ (స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ) వ్యాధి ఇప్పటికే ఆ దంపతులకు ఓ బిడ్డను దూరం చేసింది. ఇప్పుడు ఏడాది వయసున్న కుమార్తె జుహా జైనాబ్‌ అదే వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం అవసరమయ్యే ఇంజెక్షన్‌ డోసు కోసం రూ.16 కోట్లు ఖర్చు చేయాలని వైద్యులు తెలిపారు. అంత మొత్తం ఎలా తేవాలని బాధపడుతున్న తల్లిదండ్రులకు లాటరీ రూపంలో అదృష్టం వరించింది. చిన్నారికి ఊపిరిపోసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: పిల్లలకు ఉరేసి.. తల్లి బలవన్మరణం

10. దీపిక ధగధగ

ఆర్చరీ ప్రపంచకప్‌ మూడో అంచె టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి దీపిక కుమారి పసిడి పంట పండించింది. ఆదివారం ఒక్క రోజే మూడు స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. మహిళల రికర్వ్‌ టీమ్‌, మిక్స్‌డ్‌ టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో దీపిక హ్యాట్రిక్‌ స్వర్ణాలు సాధించింది. దీపికతో పాటు మిగతా భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు అద్భుతమైన ప్రదర్శనతో కొండంత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జకోవిచ్‌కు ఎదురుందా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని