Updated : 16/11/2021 09:17 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. 3 రాజధానుల మాటే వద్దు

లోతైన అధ్యయనం తర్వాతే అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించారని, నిర్మాణం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశారని, ఈ నేపథ్యంలో మూడు రాజధానుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడానికి వీల్లేదని ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ విభజన చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నూతన రాజధాని విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అమరావతి ఉద్యమంలో పాల్గొనాల్సిందే

2. MLC Elections: సుదీర్ఘ కసరత్తు

ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేయనున్న తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు జాబితా తుదిరూపుకొచ్చినా సోమవారం అర్థరాత్రి వరకు అధికారికంగా విడుదల కాలేదు. ఉదయం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహులతో సుదీర్ఘ మంతనాలు జరిగినా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Space center: అదిగదిగో.. అంతరిక్ష కేంద్రం

భూమికి 350 కిలోమీటర్ల దూరంలో గంటకు 27,724 కిలోమీటర్ల వేగంతో పుడమి చుట్టూ తిరిగే అంతరిక్ష ప్రయోగశాల అది. ఈ కేంద్రాన్ని చిత్రాల్లో చూడటమే తప్ప ప్రత్యక్షంగా కనిపించింది లేదు. గత రెండు రోజులుగా హైదరాబాద్‌ నడినెత్తిన దీని పరుగుల్ని గుర్తించినట్లు పలువురు ఖగోళశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు 5 నిమిషాలు, సోమవారం ఉదయం 4.52 గంటలకు 3 నిమిషాలు, తిరిగి సాయంత్రం 6.08 గంటలకు 6 నిమిషాల పాటు .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తొందరపడే కోయిలలు

గర్భస్థ శిశువుకు అమ్మ కడుపే అన్నీ. అవసరమైన పోషకాలు అందిస్తుంది. వెచ్చగా ఉంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇలా నిరంతరం సంరక్షిస్తూ.. నెలలు నిండాక నెమ్మదిగా బయటకు సాగనంపుతుంది. కానీ కొందరు శిశువులు నెలలు నిండకముందే తొందరపడి పోతుంటారు. మున్ముందుగా తోసుకొచ్చేస్తుంటారు (ప్రిటర్మ్‌ డెలివరీ). ఒకపక్క పూర్తిగా అభివృద్ధి చెందని అవయవాలు.. మరోపక్క బయటి వాతావరణానికి తగని శరీరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నిద్ర బంగారమే

5. ఆన్‌లైన్‌లోనూ తగ్గేదేలే!

సాంకేతిక నైపుణ్యాలను, ఉద్యోగావకాశాలను పెంచే కోర్సులను ఆన్‌లైన్‌లో అభ్యసించడంలో మన దేశీయులు ముందుకు దూసుకుపోతున్నారు. కొలువులు దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల కోసం విద్యార్థులు... నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఉద్యోగులు..ఆన్‌లైన్‌ ద్వారా చదువుకుంటున్నారు. ఈ తరహా కోర్సులను చదివే వారిలో అమెరికా తర్వాత స్థానం మనదేశానిదే కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Crime News: దొంగల బీభత్సం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి దారుణ హత్య

అనంతపురం జిల్లా కదిరిలో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష(45) ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగలు ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆమె భర్త ఉదయపు నడకకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఉషపై దాడి చేసి చంపేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన పక్కింటి మహిళ శివమ్మపై కూడా దొంగలు దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. శివమ్మను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. David Warner: వార్నరా మజాకా

అప్పుడు.. జట్టుకు విజయాలు అందించడం లేదని కెప్టెన్‌గా అతడిపై వేటు పడింది.. బ్యాట్‌తో రాణించడం లేదని తుది జట్టు నుంచీ తప్పించారు. ఇదీ నెల రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్‌లో ఓ ఆటగాడి పరిస్థితి! ఇప్పుడు.. ఫైనల్‌ సహా కీలక మ్యాచ్‌ల్లో అద్భుత బ్యాటింగ్‌తో తమ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ సొంతం చేసుకోవడంలో అతడిదే ప్రధాన పాత్ర.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ కూడా అతనే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Education: ఎంత ఎక్కువ చదివితే అంత ఆదాయం

ఉన్నత విద్యావంతుల్ని సంతోషపెట్టే విషయమిది. భారత్‌లో ఎంత ఎక్కువ చదువుకుంటే సంపాదన అంతగా పెరుగుతోందని ‘పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అనే ఎన్జీవో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. యువ జనాభా ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టాలో వివరించింది. ఈ నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ వివేక్‌ దెబ్రాయ్‌ సోమవారం విడుదల చేశారు. ప్రతి అదనపు విద్యా సంవత్సరం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Education System: అక్షరాల్లో అసమానతలు

9. Azadi Ka Amrit Mahotsav: పుట్టకముందే నేరస్థులు!

ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టుమచ్చలతో పుట్టొచ్చు! కానీ నేరస్థులుగా పుడతారా? ఎవరైనా నేరం రుజువైతే నేరస్థులవుతారు... కానీ ఇంకా భూమ్మీద కళ్లు తెరవకుండా... తల్లి కడుపులోనే నేరముద్ర వేసుకొని భూమ్మీద పడే వారుంటారా? ఉంటారంది... ఘనత వహించిన (అ)నాగరిక బ్రిటిష్‌ ప్రభుత్వం! కోట్ల మందిని పుట్టుకతోనే నేరస్థుల్ని చేసింది. తరతరాలను నేర జాతులుగా శిక్షించింది. తాజాగా ‘జై భీం’ చిత్ర నేపథ్యానికి మూలం... తెల్లవారు తెచ్చిన 1871 నాటి నేరజాతుల చట్టం (క్రిమినల్‌ ట్రైబ్స్‌ యాక్ట్‌)! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్రిప్టోపై నిషేధం వద్దు.. నియంత్రణ చాలు

క్రిప్టో కరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం విధించడం కంటే, క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలపై నియంత్రణ విధించడం మేలని ఆర్థిక అంశాలను పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయీ సంఘ సమావేశంలో అధికులు అభిప్రాయపడ్డారు. క్రిప్టోకు సంబంధించి సానుకూల, ప్రతికూల అంశాలను చర్చించేందుకు  భాజపా నేత జయంత్‌ సిన్హా ఆధ్వర్యంలోని స్థాయీ సంఘం సోమవారం తొలి సమావేశం నిర్వహించింది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీల నిర్వాహకులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సభ్యులు, ఐఐఎమ్‌ (అహ్మదాబాద్‌) నిపుణులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని