TS High Court: తెలంగాణకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కేటాయింపు రద్దు: హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ క్యాడర్‌ కేటాయింపు వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో ఆయన కొనసాగింపును రద్దు చేసింది. 

Updated : 10 Jan 2023 12:11 IST

హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్యాడర్‌ కేటాయింపు వివాదంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును రద్దు చేసింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగుతున్నారు. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లోనే కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం..  తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని