Ts News: కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు

తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా

Published : 13 Jul 2021 15:56 IST

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్‌: తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి న్యాయస్థానాల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు, హైకోర్టులో ఈనెల 31 వరకు ఆన్‌లైన్ విధానమే కొనసాగనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని