TS news: సాగర్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేత

నాగార్జునసాగర్‌లో జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది.

Updated : 10 Jul 2021 13:31 IST

నల్గొండ: నాగార్జునసాగర్‌లో జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 11 రోజుల్లో 30 మిలియన్‌ యూనిట్లను జెన్‌కో ఉత్పత్తి చేసింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణ జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని  కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని కేఆర్‌ఎంబీతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాసింది. విద్యుత్‌ ఉత్పత్తిని నిబంధనల మేరకే చేస్తున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. తమకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటున్నామని తేల్చి చెప్పింది. శ్రీశైలంలో గరిష్ఠమట్టాలకు నీరు చేరకూడదనే తెలంగాణ  విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ  వాదిస్తోంది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం సహా.. కృష్ణా జలలాల కేటాయింపులపై ఈ నెల 24న కేఆర్ఎంబీ పూర్తి స్థాయి సమావేశంలో చర్చించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని