TSPSC: 1,363 గ్రూప్-3 ఉద్యోగాలకు అప్లై చేశారా? సిలబస్ ఇదే.. వేతనం ఎంతంటే?
టీఎస్‌పీఎస్సీ(TSPSC)లో 1363 ఉద్యోగాలకు సమగ్ర నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల దరఖాస్తుకు ఫిబ్రవరి 23న సాయంత్రం 5గంటల వరకు తుది గడువు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో గ్రూప్-3 సర్వీసు(Group III services) ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ(TSPSC) నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా.. దరఖాస్తుల పక్రియ ఈ నెల 24 నుంచే మొదలైంది. వీటిలో అత్యధిక ఉద్యోగాలు ఆర్థికశాఖలో ఉన్నాయి. గ్రూప్ 3 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ(TSPSC) తాజాగా విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో పేర్కొంది.
గ్రూప్ 3 ఉద్యోగాలకు విద్యార్హతలు, వయో పరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో పాటు పరీక్ష సిలబస్‌ను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. ఆబ్జెక్టివ్ రూపంలో ఉండే ఈ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేర్కొంది. అయితే, ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారా లేదా ఆఫ్‌లైన్‌లోనా అనేది అధికారులు స్పష్టంచేయలేదు. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణితో కాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకుంటే మంచిదని సూచించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్