TSPSC group 4 exam: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్ష తేదీ వచ్చేసింది.. దరఖాస్తు చేశారా?

లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 4 (TSPSC group 4 exam)ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారైంది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Updated : 02 Feb 2023 17:12 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) గ్రూప్‌-4 పరీక్ష(Group 4 exam)కు షెడ్యూల్‌ విడుదలైంది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌ -1; మధ్యాహ్నం 2.30 గంల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 8,180 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు  గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌- 4 నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఇప్పటికే దాదాపు 9లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. తొలుత జనవరి 30తో దరఖాస్తులకు గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆఖరి గడువును ఫిబ్రవరి 3వరకు పొడిగిస్తూ ఇటీవల టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకొనేందుకు శుక్రవారంతో గడువు ముగియనుండటంతో అభ్యర్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని