వ్యాక్సిన్లు సిద్ధం.. మరి ప్రజలు సిద్ధమేనా?

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్విరామంగా జరుగుతోంది. భారత్‌లో కూడా మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కానుంది.

Published : 07 Jan 2021 01:33 IST

దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్విరామంగా జరుగుతోంది. భారత్‌లో కూడా మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేయించుకోవడంపై ప్రజల స్పందన ఏంటి? వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అసలు వారి మనసుల్లో ఏముందో తెలుసుకోడానికి లోకల్‌ సర్కిల్స్‌ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఒక సర్వేను నిర్వహించింది.  దీనిలో 26 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే తీసుకుంటామని తెలుపగా, 69శాతం మంది మాత్రం టీకా వేయించుకోవడంపై తాము ఎటూ తేల్చుకోలేకపోతున్నామని తెలిపారు. మరికొంత కాలం వేచి చూసి ఆ తర్వాత నిర్ణయించుకుంటామని తెలిపారు.

భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చినా ప్రజలకు వ్యాక్సిన్‌ భద్రతపై సరైన సమాచారం లేకపోవడంతో వారు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. అంతే కాకుండా తమ చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించేందుకు 26శాతం మంది మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మరో 56శాతం మంది మాత్రం ఒక 3నెలలు వేచి చూసి పరిస్థితిని బట్టి పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించాలా.. లేదా.. అన్నది నిర్ణయిస్తామని తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో లోకల్‌సర్కిల్స్‌ వ్యాక్సిన్‌పై సర్వేను నిర్వహించగా 61శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు సుముఖంగా లేమని తెలిపారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌పై విముఖత తగ్గినా పూర్తి స్థాయిలో ప్రజలు సిద్ధంగా లేరని ఈ సర్వే వెల్లడిస్తోంది.

ఇవీ చదవండి..

అక్కడ ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా

41దేశాలకు పాకిన కొత్త రకం కరోనా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని