కేంద్ర మంత్రికి వినోద్‌ కుమార్‌ లేఖ

రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను

Published : 18 Jan 2021 00:57 IST

హైదరాబాద్: రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినోద్‌కుమార్‌ లేఖ రాశారు. విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్న 1,218 పోస్టుల్లో ఇంకా 128 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు విద్యా బోధన సాగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో వివరించారు.

ఇవీ చదవండి..

టీకా పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డ్‌!

ఆ మార్పును గ్రహించలేకపోయాం: కిషన్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని