Railway Jobs: రైల్వే శాఖలో 3.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి: వినోద్ కుమార్
రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. దక్షిణ మధ్య రైల్వేలోనే 30వేల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఉద్యోగ ఖాళీల వల్ల సిబ్బందికి పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. పర్యవేక్షణ లోపం ప్రమాదాలకు దారి తీస్తోందని వినోద్ కుమార్ లేఖ ద్వారా మంత్రికి వివరించారు.
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని కీలకమైన టికెట్ కలెక్టర్స్, స్టేషన్ మాస్టర్స్, లోకో మోటివ్ పైలట్స్, ట్రాక్ మెంటేనర్స్, టెక్నికల్ స్టాఫ్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని వినోద్ కుమార్ లేఖలో తెలిపారు. నిరంతరంగా రైల్వే ట్రాక్స్, సిగ్నల్స్ లైటింగ్స్‌ను పర్యవేక్షించేందుకు తగిన స్థాయిలో సిబ్బంది లేని కారణంగా ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరంతరం వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఆయన లేఖలో కోరారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్
-
BJP: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!