రాబందులు రోజుకు 150కి.మీ ప్రయాణిస్తాయ్‌!

పర్యావరణ పరిరక్షణ ఉపకరించే పక్షుల్లో రాబందులు ఒకటి. ఒకప్పుడు దేశంలో అనేక ప్రాంతాల్లో విరివిరిగా కనిపించే రాబందులు కాలక్రమంలో కనుమరుగవుతున్నాయి. ఆధునిక కాలంలో అవి వాటి ఉనికిని కోల్పోతూ అంతరించపోతున్న జాతుల జాబితాలో చేరాయి. అయితే, వీటికి సంబంధించిన

Updated : 05 Feb 2021 04:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షుల్లో రాబందులు ఒకటి. ఒకప్పుడు దేశంలో అనేక ప్రాంతాల్లో విరివిగా కనిపించే రాబందులు కాలక్రమంలో కనుమరుగవుతున్నాయి. ఆధునిక కాలంలో అవి వాటి ఉనికిని కోల్పోతూ అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరాయి. అయితే, వీటికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌(పీటీఆర్‌) అధికారులు వెల్లడించారు. రాబందులు ఆహారం కోసం రోజుకు దాదాపు 150 కి.మీ ప్రయాణిస్తాయని తెలిపారు. రాబందుల దినచర్యను పరిశీలించడం కోసం పీటీఆర్‌లో ఉన్న కొన్ని రాబందులకు రేడియో-ట్రాకింగ్‌ పరికరాలను అమర్చారు. ఈ క్రమంలోనే రాబందుల ప్రయాణించే దూరమెంతో తెలిసింది.

‘‘మా సంరక్షణలో ఉన్న రాబందుల్లో మూడు రాబందులకు గత నవంబర్‌లో రేడియో-ట్రాకింగ్‌ పరికరాలు అమర్చి వాటి దినచర్యను పరిశీలించాం. అవి ఆహారం కోసం ప్రతి రోజు 100 కి.మీ నుంచి 150 కి.మీ ప్రయాణిస్తున్నాయి. ఈ మూడు రాబందులు తరచూ పన్నా నుంచి పక్కరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి సాయంత్రం వేళకు తిరిగి వస్తున్నాయి’’అని పీటీఆర్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ కుమార్‌ శర్మ తెలిపారు. మరికొన్ని రాబందులకు కూడా త్వరలో రేడియో-ట్రాకింగ్‌ పరికరాలను అమర్చనున్నట్లు చెప్పారు. 2019 గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో 8,397 రాబందులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో ఉన్న రాబందుల సంఖ్యే అధికం.

ఇవీ చదవండి..

మేక @ జూమ్‌ మీటింగ్స్‌

బర్డ్‌ఫ్లూ: గుడ్డు.. మాంసం తినొచ్చా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని