Weather Update: తెలంగాణలో 3 రోజులు ఆరెంజ్‌ హెచ్చరికలు

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనంతో తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

Updated : 03 Sep 2023 17:57 IST

హైదరాబాద్‌: ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనంతో తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో పడే అవకాశం ఉందని తెలిపింది.  

ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని