‘మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు అవసరం’

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మూడేళ్ల క్రితం వి-హబ్‌ను ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 10 Mar 2021 12:46 IST

పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మూడేళ్ల క్రితం వి-హబ్‌ను ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఐటీసీలో అప్‌సర్జ్‌ పేరుతో ఏర్పాటు చేసిన ప్రి-ఇంక్యుబేషన్‌ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో అప్‌సర్జ్‌ వి-హబ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా హై కమిషనర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మహిళా పారిశ్రామిక వేత్తలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని