OCD problem: పదే పదే శుభ్రం చేస్తున్నారా..? ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా..!

చెప్పిన మాటలనే మళ్లీ మళ్లీ చెప్పడం..చేసిన పనినే అదే పనిగా చేయడం..శుభ్రం చేసినా మళ్లీ అనుమానం వచ్చి మరోసారి శుభ్రం చేయడానికి సిద్ధం కావడం సాధారణ విషయం కాదు..అదో మానసిక రుగ్మత. తెలియకుండానే అదే యావలో ఉండిపోతారు. శారీరకంగా, ఆర్ఘికంగా నష్టం జరిగినా పెద్దగా పట్టించుకోని తీరు వాళ్లలో వ్యక్తం అవుతుంది.

Updated : 19 Oct 2022 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెప్పిన మాటలనే మళ్లీ మళ్లీ చెప్పడం..చేసిన పనినే అదే పనిగా చేయడం..శుభ్రం చేసినా మళ్లీ అనుమానం వచ్చి మరోసారి శుభ్రం చేయడానికి సిద్ధం కావడం సాధారణ విషయం కాదు..అదో మానసిక రుగ్మత. తెలియకుండానే అదే యావలో ఉండిపోతారు. శారీరకంగా, ఆర్థికంగా నష్టం జరిగినా పెద్దగా పట్టించుకోని తీరు వాళ్లలో వ్యక్తం అవుతుంది. ఈ సమస్యను యోగాలోని కొన్ని ప్రక్రియలతో తొలగించుకోవడానికి వీలుందని యోగా గురువు ఆర్‌.ఆర్‌.ప్రసాద్‌ తెలిపారు.

ఇది మానసిక సమస్యే..

మనసులో అనుమానం, మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని పనులను పదే పదే చేస్తారు. ఇలాంటి వారు ఆ ఇబ్బందులను అధిగమించడానికి పాదహస్తాసనం చేయడం ఎంతో ఉపకరిస్తుంది. ధ్యానముద్ర చేయడంతో మనసు సరైన స్థితిలోకి వస్తుంది. ఈ యోగాసనాలను ఉదయం, సాయంత్రం ఐదుసార్లు చొప్పున చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని