మణిపూర్‌లో కమలం జోరు

మణిపూర్‌ ఉపఎన్నికల్లో భాజపా ఆధిపత్యం కనిపించింది. పోటీ చేసిన నాలుగు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో ఐదు స్థానాలకు ఉప ఎన్నికల్లో జరగగా నాలుగింట్లో విజయం సాధించింది...

Published : 10 Nov 2020 18:33 IST

పోటీ చేసిన నాలుగు స్థానాల్లో జయకేతనం

ఇంపాల్‌: మణిపూర్‌ ఉపఎన్నికల్లో భాజపా ఆధిపత్యం కనిపించింది. పోటీ చేసిన నాలుగు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో ఐదు స్థానాలకు ఉప ఎన్నికల్లో జరగగా నాలుగింట్లో విజయం సాధించింది. వాంగోయ్‌ నియోజకవర్గంలో ఒయ్‌నమ్‌ లుఖోయ్‌ సింగ్‌, సింఘత్‌లో గిన్‌సుఅన్హు, సైతు నుంచి గమ్‌తంగ్‌ హోకిప్‌, వాంగ్‌జింగ్‌ టెంతాలో పానమ్‌ బ్రోజెన్‌ సింగ్‌ గెలుపొందినట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. కాగా కమలం పోటీచేయని లిలాంగ్‌ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి అంతాస్‌ఖాన్‌ విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో భాజపా విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బిరెన్‌సింగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘భాజపాకి ఇదో గొప్ప రోజు. రాష్ట్రంలో ఐదు స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపా పోటీచేసిన నాలుగింట్లో విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలు మరోసారి ప్రధాని మోదీపై, భాజపాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు’ అని ట్విటర్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని