CBSE పరీక్షలెప్పుడో ఆ రోజు చెబుతా: మంత్రి 

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ కీలక ప్రకటన చేశారు. బోర్డు పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది డిసెంబర్‌ 31న సాయంత్రం 6గంటలకు........

Published : 27 Dec 2020 01:04 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ కీలక ప్రకటన చేశారు. బోర్డు పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ డిసెంబర్‌ 31న సాయంత్రం 6గంటలకు వెల్లడిస్తానన్నారు. ఈ మేరకు ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి శనివారం రాత్రి ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ ప్రభావం విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో 2021లో సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. 

అయితే, మంగళవారం ఉపాధ్యాయులతో వర్చువల్‌ సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌.. సీబీఎస్‌ఈ 10, 12 తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండదని స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి తేదీలను కూడా ఆయన వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి..

వింగ్‌లూంగ్.. తొంగిచూస్తే కూల్చేస్తాం..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని