హెలికాప్టర్‌ ప్రమాదం.. తప్పించుకున్న కేంద్రమంత్రి!

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బిహార్‌లోని లౌఖా నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తిరుగు పయనమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 17 Oct 2020 20:36 IST

పట్నా: కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బిహార్‌లోని లౌఖా నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పట్నా విమానాశ్రయంలో తిరుగు పయనమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ రెక్కలు సమీపంలో విమానాశ్రయ వైరింగ్‌లను తాకడంతో విరిగిపోయాయి. దీంతో హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. కాగా ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి  సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో ఆయనతో పాటు బిహార్‌ ఆరోగ్య మంత్రి మంగల్‌పాండే, జలవనరుల మంత్రి సంజయ్‌జా ఉన్నారు. ఈ ఘటనకు ముందు మధుబని జిల్లా లౌఖా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. బిహార్‌లో ప్రజలు మరోసారి ఎన్డీయే కూటమికి ఓటు వేసి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని