ముంబయి సురక్షితం కాదు: అమృత ఫడణవీస్!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య కేసు విచారణపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బిహార్ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించడంలేదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ మృతి కేసుపై ముంబయి పోలీసులు సరిగా దర్యాప్తు జరపడంలేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య కేసు విచారణపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బిహార్ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించడంలేదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ మృతి కేసుపై ముంబయి పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపడంలేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్ ముంబయి పోలీసుల తీరుపై మండిపడ్డారు. ‘ముంబయి తన మానవత్వాన్ని కోల్పోయింది. నగర పోలీసులు సుశాంత్ సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న తీరును చూస్తుంటే అమాయకులు, ఆత్మాభిమానం ఉన్నవారికి ఇక్కడ నివసించడం సురక్షితం కాదని అర్థమవుతోంది’ అని అమృత ట్విటర్లో పేర్కొన్నారు. అంతకుముందు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా ముంబయి పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. బిహార్ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించకపోవడం వింతగా ఉందన్నారు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.
అమృత ట్వీట్‌పై శివసేన, ఎన్సీపీ పార్టీలు స్పందించాయి. మీకు రక్షణగా ఉంటున్న పోలీసుల తీరుపైనే విమర్శలు చేయడం వారిని అవమానించడమేనని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం మీకున్న పోలీసులను వెనక్కి పంపించి ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవాలని అమృతకు సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి భార్యగా అమృత ఈవ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్సీపీ నేతలు కూడా అమృత తీరుపై విమర్శలు చేస్తున్నారు.
ఇవీ చదవండి..
నొప్పిలేకుండా చావు: గూగుల్‌లో వెతికిన సుశాంత్
సుశాంత్‌కు అపాయం ఉందంటే పట్టించుకోలేదట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్‌కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
లోక్‌సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్‌సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్‌పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్‌లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..