కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష ఖాళీలు
బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని తెలిపింది...........
రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం
దిల్లీ: బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని తెలిపింది. ఈ మేరకు సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా బీఎస్ఎఫ్లో 28,926 ఖాళీలు ఉన్నాయన్నారు. సీఆర్పీఎఫ్లో 26,506, సీఐఎస్ఎఫ్లో 23,906, ఎస్ఎస్బీలో 18,643, ఐటీబీపీలో 5,784, అస్సాం రైఫిల్స్‌లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో చాలా వరకు కానిస్టేబుల్ స్థాయి పోస్టులేనన్నారు.
నిర్ధారిత ప్రక్రియ ద్వారానే వీటిని భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. వీటిలో కొన్ని పదోన్నతులు, డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మరికొన్నింటికి కొత్తగా నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం 60,210 కానిస్టేబుల్, 2,534 ఎస్ఐ పోస్టులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా.. 330 అసిస్టెంట్ కమాండెట్స్ పోస్టుల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్