14లక్షల మందికి పైగా పౌరుల్ని వెనక్కి తెచ్చాం 

కరోనాతో నెలకొన్న భయానక పరిస్థితులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమం.......

Published : 18 Sep 2020 02:08 IST

కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన

దిల్లీ: కరోనాతో నెలకొన్న భయానక పరిస్థితులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమం చేపట్టిన చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటిదాకా ప్రపంచంలోని పలు దేశాల నుంచి 14లక్షల మందికి పైగా భారతీయ పౌరుల్ని స్వదేశానికి రప్పించినట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో ఆ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రయాణికులు రిజిస్టర్‌ చేయించుకున్న వివరాల ఆధారంగా ఇప్పటివరకు 14,12,835 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. వీరిలో 56,874 మంది విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలిపారు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా వీరందరనీ వెనక్కి తీసుకొచ్చినట్టు మంత్రి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని