XBB.1.16: కొవిడ్ తాజా విజృంభణకు ఈ వేరియంట్ కారణమా..?
దేశంలో కొవిడ్ కేసులు పెరగడానికి ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణమై ఉండొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇన్సాకాగ్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 349 కేసులు ఈ కొత్త వేరియంట్‌వే ఉన్నాయి.
దిల్లీ: దేశంలో కొన్ని రోజులుగా కొవిడ్-19 (Coronavirus)తోపాటు ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో రోజువారీ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కొత్త వేరియంట్ కారణమా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ కేసులకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో (Genome Sequencing) 349 కేసులు ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నట్లు వెల్లడైంది. దీంతో దేశంలో కొవిడ్ తాజా విజృంభణకు ఈ వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలో మొదటిసారిగా ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించి రెండు కేసులు జనవరిలో బయటపడ్డాయి. ఫిబ్రవరిలో 140 నమూనాల్లో ఇవి వెలుగు చూడగా.. మార్చి నెలలో మరో 207 గుర్తించినట్లు ఇండియన్ సార్స్‌కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 349 నమూనాల్లో ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ బయటపడినట్లు ఇన్సాకాగ్ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు 105 వెలుగు చూడగా.. తెలంగాణలో 93, కర్ణాటకలో 61, గుజరాత్ 54 కేసులు బయటపడినట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా కొవిడ్ తాజా విజృంభణకు కొత్త వేరియంట్ కారణమై ఉండొచ్చని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ తీవ్ర జబ్బు, మరణానికి దారితీయనంతవరకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతున్నా కొద్ది ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.
దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 1300 దాటింది. నిన్న ఒక్కరోజే ముగ్గురు మరణించారు. 140 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసుల పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి కూడా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లపై జాగ్రత్తగా ఉంటూ కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. ముఖ్యంగా కొత్త వేరియంట్లను వేగంగా గుర్తించేందుకు గాను జీనోమ్ సీక్వెన్సింగ్‌ను అధిక స్థాయిలో చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు
-
Politics News
PM Modi: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం కీలక భేటీ
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!