Anand Mahindra: సవాళ్లకే ఆమె సవాల్‌.. మహిళా ఆటోడ్రైవర్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ట్విటర్‌లో మరో స్ఫూర్తిదాయక గాథను పంచుకున్నారు. తన పిల్లలను పెంచేందుకు ఆటో డ్రైవర్‌గా మారిన ఓ పంజాబీ మహిళను కొనియాడారు.

Published : 09 Dec 2022 18:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. ఎప్పటికప్పుడు సందేశాత్మక, స్ఫూర్తిదాయక విషయాలను పోస్ట్‌ చేస్తుంటారు. ఇటీవల ఓ పంజాబీ మహిళ స్ఫూర్తి గాథను పంచుకున్నారు. పిల్లలను చదివించడం కోసం ఆటోడ్రైవర్‌గా మారిన ఆ మహిళ ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు.

‘‘పరమ్‌జిత్‌ కౌర్‌.. పంజాబ్‌లో మా మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఆటోను కొనుగోలు చేసిన తొలి మహిళా కస్టమర్‌. భర్తను కోల్పోయిన తర్వాత ఆమె తన ఇంటికి మూలాధారమయ్యారు. తన కుమార్తెల్లో ఒకరు ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసేందుకు మా ‘ఇ ఆల్ఫా మినీ(ఎలక్ట్రిక్ ఆటో)’ ఆమెకు భరోసాగా మారింది. సవాళ్లను అధిగమించి ఎలా ఎదగాలో ఆమె నిరూపించారు’’ అని ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఆమె ఫొటోను కూడా జత చేశారు.

ఈ పోస్ట్‌కు నెట్టింట పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ‘‘సమస్యలతో సతమతమవుతున్న ఎంతోమందికి ఆమె ఆదర్శం. ఆత్మవిశ్వాసంతో ఆమె జీవితంలో ముందుకెళ్తోంది’’ అని ఓ నెటిజన్‌ అభినందించారు. ‘‘ప్రతికూలతలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా జీవితంతో పోరాడుతున్న ఆమెకు సెల్యూట్‌. అద్భుతం’ అని మరికొందరు ఆమెను కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని