బంగ్లాదేశ్‌, నేపాల్‌కు చేరిన భారత టీకాలు

భారత్‌కు పొరుగు దేశాలతో సంబంధాలే తొలి ప్రాధాన్యమని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. బంగ్లా, నేపాల్‌లకు భారత్‌ నుంచి ఔషధ సాయంగా గురువారం కొవిడ్‌-19 టీకాలు చేరుకున్న క్రమంలో ఆయన ఈ మేరకు ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు టీకాలు చేరుకున్నాయి. పొరుగు దేశాలతో సంబంధాలే భారత్‌కు తొలి ప్రాధాన్యం’ అంటూ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

Published : 21 Jan 2021 23:44 IST

దిల్లీ: భారత్‌కు పొరుగు దేశాలతో సంబంధాలే తొలి ప్రాధాన్యమని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. బంగ్లా, నేపాల్‌లకు భారత్‌ నుంచి ఔషధ సాయంగా గురువారం కొవిడ్‌-19 టీకాలు చేరుకున్న క్రమంలో ఆయన ఈ మేరకు ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు టీకాలు చేరుకున్నాయి. పొరుగు దేశాలతో సంబంధాలే భారత్‌కు తొలి ప్రాధాన్యం’ అంటూ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

పొరుగు దేశాలకు ఔషధ సాయంలో భాగంగా బంగ్లాదేశ్‌కు 2 మిలియన్లు, నేపాల్‌కు 1 మిలియన్‌ టీకా డోసులను భారత్‌ సరఫరా చేసింది. ఆ టీకా డోసులు గురువారం ఆయా దేశాలకు చేరుకున్నాయి. బంగ్లాదేశ్‌కు చేరుకున్న 2 మిలియన్ల టీకాలను ఆ దేశ విదేశాంగ మంత్రి డా.ఏకే అబ్దుల్‌ మోమెన్‌కు భారత హై కమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి అందజేశారు. ఈ సందర్భంగా మోమెన్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌.. 1971లో లిబరేషన్‌ వార్‌ సమయంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచింది. మళ్లీ ఈ రోజు కరోనా వైరస్‌ మహమ్మారి సంక్షభ సమయంలోనూ భారత్‌ మాకు అండగా నిలుస్తోంది.  భారత్‌ చేపట్టే ఇలాంటి కార్యక్రమాలే రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ప్రతీక’ అని చెప్పారు. నేపాల్‌లో టీకాలను అందుకున్న అనంతరం ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. భారత ప్రధాని నరేంద్రమోదీకి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

పొరుగు, కీలక భాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా భారత్‌ ఆరు దేశాలకు బుధవారం నుంచి టీకాల సరఫరా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భూటాన్‌ దేశానికి సైతం 1.50లక్షలు, మాల్దీవులకు లక్ష డోసులను పంపిణీ చేసింది. 

ఇదీ చదవండి

మాల్దీవులకు చేరిన భారత టీకాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని