Beating Retreat: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అటారీ-వాఘా సరిహద్దులో (Wagah Border) బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు (Beating Retreat) ఘనంగా జరిగాయి.

Published : 14 Aug 2022 20:43 IST

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అటారీ-వాఘా సరిహద్దులో (Wagah Border) బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు (Beating Retreat) ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు కవాతు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికులు ఉత్సాహంగా పరస్పరం కరచాలనం చేసుకోవడం ప్రతిఒక్కర్నీ ఆకర్షించింది.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న అట్టారీ సరిహద్దులో జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు వేల సంఖ్యలో ఇరు దేశాల పౌరులు హాజరవుతుంటారు. సుమారు గంటసమయం పాటు జరిగే ఈ ప్రదర్శనలో ఇరు దేశాల సైనికులు కవాతుతోపాటు పలు ప్రదర్శనలు చేస్తారు. నేడు పాకిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం జరిగిన వేడుకల్లో పాక్‌ రేంజర్లు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని