Work from home: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కష్టాలు.. ఇంట్లో సీసీటీవీ!

కరోనా కారణంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమంటున్నాయి. దీంతో ఉద్యోగులంతా హాయిగా ఇంట్లోనే ఉంటూ.. సౌకర్యవంతంగా కూర్చొని పనిచేసుకుంటున్నారు. అయితే, వారికి ప్రమోషన్లు, ఇంక్రీమెంట్లు ఇవ్వాలంటే ఉద్యోగి పనితీరుతోపాటు వారి ప్రవర్తన కూడా బాగుండాలని కొన్ని

Updated : 10 Aug 2021 21:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమంటున్నాయి. దీంతో ఉద్యోగులంతా హాయిగా ఇంట్లోనే ఉంటూ.. సౌకర్యవంతంగా కూర్చొని పనిచేసుకుంటున్నారు. అయితే, వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటే ఉద్యోగి పనితీరుతోపాటు వారి ప్రవర్తన కూడా బాగుండాలని కొన్ని కంపెనీలు పాలసీగా పెట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో కార్యాలయంలో అయితే ఉద్యోగిని ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. మరి వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తుంటే ఎలా అనే సందిగ్ధంలో పడ్డాయి కంపెనీలు. కాగా.. దీనికి పరిష్కారంగా ఓ సంస్థ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కార్పొరేట్‌ కల్చర్‌లో చర్చనీయాంశమైంది. ఆ సంస్థ ఉద్యోగులు యాజమాన్యం నిర్ణయంపై మండిపడుతున్నారు.

ఓ అంతర్జాతీయ స్థాయి కాల్‌ సెంటర్‌ కంపెనీలో దాదాపు 4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలా మంది ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఉద్యోగుల పనితీరు తెలుసుకోవడం కోసం ఆ కంపెనీ.. వారి ఇళ్లలో కృత్రిమమేథతో కూడిన సీసీటీవీ కెమెరాలు పెట్టి గమనించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇళ్లలో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులపై ఒత్తిడి చేస్తోంది. సీసీటీవీ ఫుటేజీలను ఉద్యోగి కుటుంబసభ్యుల ద్వారా సేకరించి వారి పనితీరును పరిశీలించనుందట. 

ఆ కంపెనీ నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ‘‘ఇంట్లో ఉద్యోగి ఏం చేస్తున్నాడని గమనించడం మంచి ఆలోచన కాదు. నేను మా ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఉండి పనిచేస్తా.. అలాంటప్పుడు బెడ్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టాలంటారా? అది ఎంత వరకు సబబు? నేను మాత్రం ఈ నిర్ణయాన్ని అంగీకరించను’ అని ఓ ఉద్యోగిని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ విధానంపై పలు సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల ఇంట్లో సీసీటీవీ కెమెరా అంశంపై చర్చలు మొదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని