Mamata Banerjee: ఆధార్‌లను ‘డీయాక్టివేట్‌’ చేస్తోంది.. కేంద్రంపై బెంగాల్‌ సీఎం ఆరోపణలు

తమ రాష్ట్రంలో కొంతమంది ఆధార్‌ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్‌ చేస్తోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Published : 18 Feb 2024 16:21 IST

కోల్‌కతా: భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో ఆధార్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేస్తోందని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరనీయడం లేదని విమర్శించారు. బీర్‌భూమ్‌ జిల్లాలో నిర్వహించిన ఓ ప్రజాపంపిణీ కార్యక్రమంలో సీఎం మమతా ఈమేరకు మాట్లాడారు. ఆధార్‌ కార్డు లేకపోయినప్పటికీ లబ్ధిదారులకు తమ ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు.

దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరంటే..?

‘‘మీరంతా జాగ్రత్తగా ఉండండి. బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోంది. ప్రభుత్వ పథకాలతో వాటిని డీలింక్‌ చేస్తోంది. అయితే.. ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలను దూరం చేయబోం’’ అని దీదీ తెలిపారు. హరియాణా, పంజాబ్‌లలో రైతులు చేపడుతోన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. బెంగాల్‌లోని అన్నదాతలకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. కర్షకుల నిరసనకు సెల్యూట్ చేస్తున్నానని, వారిపై దాడులను ఖండిస్తున్నానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని