Popular Chief Minister: దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరంటే..?

భారత్‌లో ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులపై ఓ సంస్థ తయారు చేసిన జాబితాలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తొలి స్థానంలో నిలిచారు. 

Updated : 19 Feb 2024 00:24 IST

దిల్లీ: దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఒక ర్యాంకు దిగువకు చేరారు. ఇటీవల ‘ఇండియా టుడే’ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

భారత్‌లో అత్యధిక కాలం సీఎంగా ఉన్న నవీన్‌ పట్నాయక్‌ 52.7 శాతం ప్రజాదరణతో అగ్రస్థానంలో ఉన్నారు. 2000 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. 51.3 శాతం పాపులారిటీతో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రెండో స్థానంలో ఉన్నారు. 2017 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 48.6 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో ఉన్నారు. 2021లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

గుల్జార్‌, రామభద్రాచార్యలకు జ్ఞానపీఠ్‌

42.6 శాతంతో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ నాలుగో స్థానంలో నిలవగా.. తిప్రుర సీఎం మాణిక్‌ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానం దక్కించుకున్నారు.  2016లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన సాహా 2022లో సీఎం పీఠమెక్కారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని