Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!

ఓ విమాన ప్రయాణికుడు భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న జంతువులను చెన్నై విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వస్తున్న TG-337 నంబర్‌ విమానంలో........

Published : 14 Aug 2022 02:18 IST

చెన్నై: ఓ విమాన ప్రయాణికుడు భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న జంతువులను చెన్నై విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వస్తున్న TG-337 నంబర్‌ విమానంలో జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణికుడిని అదుపులోని తీసుకున్నారు. అతడి బ్యాగుల్లో నుంచి ఒక డి బ్రజ్జా జాతికి చెందిన కోతి, 15 కింగ్‌ స్నేక్స్‌, ఐదు కొండచిలువ పిల్లలు, రెండు అల్డబ్రా తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అవ్వన్నీ బతికే ఉన్నట్లు పేర్కొన్నారు.

జంతువులను అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. యానిమల్స్ క్వారంటైన్ అండ్‌ సర్టిఫికేషన్ సర్వీసెస్ (AQCS)తో సంప్రదించిన అనంతరం వాటన్నింటిని థాయ్‌ ఎయిర్‌వేస్‌ ద్వారా తిరిగి స్వదేశానికి పంపనున్నట్లు స్పష్టం చేశారు. ఆ జంతువుల పొటోలను కస్టమ్స్‌ అధికారులు ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని