CJI: సీజేఐగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌.. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.

Updated : 09 Nov 2022 14:01 IST

దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. రెండేళ్లపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్‌ రెండేళ్లపాటు (నవంబర్‌ 10, 2024) సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 44 ఏళ్లక్రితం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. ఈ ఘట్టం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి చోటుచేసుకుంది. 

అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్ఛిత్తి, ఆధార్‌ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం తదితర కేసులలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చారిత్రక తీర్పులు ఇచ్చారు. సుప్రీంకోర్టు కంటే ముందు అలహాబాద్, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పనిచేశారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. 1998-2000 మధ్య అదనపు సొలిసిటర్ జనరల్‌గానూ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, పీయూష్‌ గోయల్‌, కిరణ్‌రిజిజు తదితరులు హాజరయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని