
VPN Network: నిబంధనలు పాటించండి.. లేదంటే భారత్ నుంచి వెళ్లిపోండి
వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్ర ఐటీశాఖ స్పష్టం
దిల్లీ: భారత్ రూపొందించిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు నడుచుకోవాల్సిందేనని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఒకవేళ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు లేదా ఇతర వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లు నూతన మార్గదర్శకాలను పాటించకుంటే దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వారికి మరోమార్గం లేదని తేల్చిచెప్పారు. సైబర్ ఉల్లంఘనల నమోదుపై ఇటీవల రూపొందించిన మార్గదర్శకాలపై తరచూ అడిగే ప్రశ్నలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.
‘భారత్‌లో నిబంధనలు, చట్టాలను పాటించలేమని చెప్పడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. ఇప్పటివరకు లాగ్ రికార్డులు లేకుంటే.. వాటిని ఇకనుంచి మొదలుపెట్టండి. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్గదర్శకాలు పాటించలేమని కోరుకునేవారు ఒకవేళ భారత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటే నిరభ్యంతరంగా నిష్క్రమించవచ్చు’ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నిబంధనల్లో ప్రభుత్వం ఎటువంటి మార్పుచేయదని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, వీపీఎన్ సంస్థలు, డేటా సెంటర్లు యూజర్ డేటాను ఐదేళ్లపాటు భద్రపరచడం తప్పనిసరి చేస్తూ ఇటీవల ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) నిబంధనలు జారీ చేసింది. అంతేకాకుండా సైబర్ దాడులకు సంబంధించిన ఘటనలను గుర్తించిన ఆరు గంటల్లోపే వాటి వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. అయితే, వీటిని వ్యతిరేకిస్తోన్న కొన్ని వీపీఎన్ కంపెనీలు.. ఈ కొత్త నిబంధనలు సమాచార భద్రతలో లొసుగులకు దారితీస్తాయని వాదిస్తున్నాయి. ఇదే విషయంపై గూగుల్, ఫేస్‌బుక్, ఐబీఎం, సీస్కో వంటి టెక్ దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న అమెరికాకు చెందిన ఐటీఐ కూడా మార్గదర్శకాలను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ నిబంధనలు ఎట్టిపరిస్థితుల్లో మార్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten news @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Business News
New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
-
General News
Telangana News: టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు
-
Movies News
Sita Ramam: ఇట్లు.. నీ భార్య సీతామహాలక్ష్మీ.. హృద్యంగా ‘సీతారామం’ టీజర్
-
Politics News
Andhra News: ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
Business News
BSNL: బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటున్నారా?ఈ BSNL ప్యాక్‌పై లుక్కేయాల్సిందే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు