India Corona: కరుగుతున్న కరోనా కేసుల కొండ!

దేశంలో కరోనా కేసులు, మరణాలు వరుసగా మూడోరోజైన ఆదివారం కూడా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,65,553 కేసులు, 3,460 మరణాలు నమోదయ్యాయి. రెండు లక్షలక.....

Updated : 30 May 2021 11:04 IST

వరుసగా మూడోరోజూ కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం

దిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు వరుసగా మూడోరోజైన ఆదివారం కూడా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,65,553 కేసులు, 3,460 మరణాలు నమోదయ్యాయి. రెండు లక్షలకు దిగువన కొత్త కేసులు నమోదు కావడం వరుసగా ఇది మూడోరోజు. ఇంతవరకు మొత్తంగా కేసుల సంఖ్య 2.79 కోట్లకు చేరువ కాగా, మహమ్మారి బారిన పడి 3,25,972 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.17 శాతంగా ఉంది. రోజువారీ మరణాలు గత ఐదు రోజుల కంటే తక్కువ నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు వరుసగా 6వ రోజు 10%లోపు నమోదైంది. ఒక్క రోజులో 2,76,309 మంది కోలుకోగా రివకరీ రేటు 91.25%కి పెరిగింది. క్రియాశీలక కేసుల సంఖ్య మరింత తగ్గి 21,14,508 (7.58%)కి చేరింది. దేశవ్యాప్తంగా శనివారం 20,63,839 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఇంతవరకు జరిపిన పరీక్షల సంఖ్య 34.31 కోట్లు దాటింది. దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి 21,20,66,614 కొవిడ్‌ టీకా డోసులు వేశారు. గత 24 గంటల్లో 30,35,749 టీకాలు పంపిణీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని