Gadkari: డ్రోన్లతో ప్రయాణించే రోజు ఇంకెంతో దూరంలేదు.. గడ్కరీ

AirTaxi: మనం డ్రోన్లపై ప్రయాణించే రోజు ఇంకెంతోదూరం లేదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.

Published : 15 Aug 2023 01:49 IST

నాగ్‌పుర్‌: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్లు (ఎయిర్‌ ట్యాక్సీలు)పై మనం ప్రయాణించే రోజు ఇంకెంతో దూరం లేదన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో రాష్ట్రనిర్మాణ్‌ సమితి ఆధ్వర్యంలో ‘అఖండ్‌ భారత్‌ సంకల్ప్‌ దినోత్సవం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతులు ఎరువుల వినియోగానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారని.. అలాగే, 200 కిలోల బరువు కలిగిన వస్తువులను సైతం రవాణా చేసేందుకు వీటిని వాడుతున్నట్టు చెప్పారు . ఈ నేపథ్యంలోనే మనం రైల్వే స్టేషన్‌ లేదా ఎయిర్‌ పోర్టులకు వెళ్లేందుకు డ్రోన్ల(ఎయిర్‌ ట్యాక్సీలు)ను ఉపయోగించే రోజులు ఇంకెంతో దూరం లేవంటూ వ్యాఖ్యానించారు.  దేశ సరిహద్దులను కాపాడుకొనేందుకు, గ్రామలను అభివృద్ధి బాటలో నిలిపేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని విద్యార్థులను ఆయన కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని