Corona: దిల్లీలో కొవిడ్‌ విజృంభణ.. భారీగా పెరిగిన మరణాలు

దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఏకంగా 27,561 కొత్త కేసులు నమోదయ్యాయి......

Published : 12 Jan 2022 21:58 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఏకంగా 27,561 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవి 29శాతం అధికం. గత ఏడు నెలల్లో ఇవే అత్యధికం. కొత్త కేసులతో రాజధానిలో పాజిటివిటీ రేటు 26 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో కొవిడ్‌తో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. గత జూన్‌ నుంచి ఇవే అత్యధిక మరణాలు. ప్రభుత్వ బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం 87,445 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇందులో 25,240 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 2363 మంది ఆసుపత్రుల్లో చేరారు.

ముంబయిలో 40 శాతం కేసుల పెరుగుదల

ముంబయి నగరంలోనూ కొవిడ్‌ వ్యాప్తి అధికంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 67,339 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా అందులో 16,420 మందికి పాజిటివ్‌గా తేలడం వైరస్‌ విజృంభణకు అద్దంపడుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు 40శాతం పెరగడం గమనార్హం. తాజా కేసులతో ముంబయిలో పాజిటివిటీ రేటు 18.75 శాతం నుంచి 24.38 శాతానికి ఎగబాకింది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య తగ్గగా.. మళ్లీ విజృంభించడం భయాందోళన కలిగిస్తోంది. అయితే ఈ 16,420 కేసుల్లో 83 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని