బెంగళూరులో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తుంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి

Published : 15 Apr 2022 15:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తుంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉన్నట్టుండి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వర్షపు నీరు భారీగా రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు రోడ్లపై ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల నడుము లోతు నీటిలో జనావాసాలు చిక్కుకుపోయాయి. ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన బృహత్‌ బెంగళూరు మహానగర పాలికే( BBMP)అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని బీబీఎంపీ ప్రధాన కమిషనర్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బెంగళూరులో మరో మూడు రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని