దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీకి రైతుల సన్నాహాలు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వడంతో....

Updated : 24 Jan 2024 17:20 IST

దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వడంతో అన్నదాతలు సన్నాహాలు ముమ్మరం చేశారు. హరియాణా, పంజాబ్‌కు చెందిన కర్షకులు ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు. మువ్వన్నెల జెండాలతో ఉన్న ట్రాక్టర్లు హస్తిన వైపు పయనిస్తున్నాయి. దిల్లీ రింగురోడ్డు పరిధిలో 100 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నదాతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ర్యాలీ మొత్తం శాంతియుతంగా నిర్వహించాలని రైతు సంఘాలు కోరాయి. ట్రాక్టర్‌ ప్రదర్శనలు ఘాజీపూర్‌, టిక్రీ, సింఘు సరిహద్దు పాయింట్ల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి...

చైనా యాప్‌లపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

మోదీకి దుబాయ్‌ విద్యార్థి గణతంత్ర బహుమతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని