మాస్క్‌ మస్ట్‌: 5 రోజుల్లో 18500 మందికి ఫైన్‌! 

దేశ రాజధాని నగరంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో దిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. వైరస్‌ కట్టడే లక్ష్యంగా కొవిడ్‌ నిబంధనలు.......

Updated : 30 Mar 2021 22:00 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో దిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. వైరస్‌ కట్టడే లక్ష్యంగా కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధిస్తోంది. ఇందులో భాగంగా గత ఐదు రోజుల వ్యవధిలో 18500 మంది నుంచి జరిమానా రూపంలో రూ.3.18 కోట్లు వసూలైనట్టు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో నార్త్‌ దిల్లీలో అత్యధిక మంది ఉండగా.. ఈస్ట్‌ దిల్లీలో అత్యల్పంగా ఉన్నట్టు తెలిపింది. ప్రజలు గుమిగూడకుండా హోలీ, షాబ్‌ఈ బరత్‌ వంటి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

మరోవైపు, నగరంలో కేసులు పెరిగిపోవడంతో కొన్ని ఆస్పత్రుల్లో సాధారణ, ఐసీయూ పడకల సంఖ్యను పెంచాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయించారు. తద్వారా పడకల లభ్యత మెరుగుపడుతుందన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని