Omicron: ఒమిక్రాన్ తొలి చిత్రం ఇలా..!
సార్స్‌కోవ్-2 వైరస్‌లో కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్లో డెల్టాతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తొలి చిత్రాన్ని రోమ్‌లోని ప్రఖ్యాత ‘బాంబినో గెసు’ ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి.
ఇంటర్నెట్‌డెస్క్: సార్స్‌కోవ్-2 వైరస్‌లో మ్యూటేషన్ చెంది కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఒమిక్రాన్‌ను డెల్టాతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తొలి చిత్రాన్ని రోమ్‌లోని ప్రఖ్యాత ‘బాంబినో గెసు’ ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ఈ త్రీడైమెన్షనల్ చిత్రం ఒక మ్యాప్‌లా ఉంది. ‘‘డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌లో చాలా మార్పులు చోటు చేసుకొన్నట్లు మనం స్పష్టంగా చూడవచ్చు. ఆ మార్పులు మొత్తం మానవ శరీరానికి అతుక్కునే ఒక ప్రొటీన్ భాగంలోనే చోటు చేసుకొన్నట్లు అర్థమవుతోంది. ఇవి కేవలం ప్రమాదకరమైనవే కాదు.. మానవులకు భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయి’’ అని పరిశోధకులు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రోమ్‌లోని ఈ పరిశోధన బృందం కరోనావైరస్లో వచ్చే మ్యూటేషన్ల స్పైక్ ప్రొటీన్ త్రీడైమన్షనల్ ఇమేజస్ పై దృష్టిపెట్టిందని మిలన్ స్టేట్ యూనివర్శిటీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ క్లౌడియా ఆల్టరీ పేర్కొన్నారు. ఇక ఒమిక్రాన్‌తో వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతుందా..? వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గుతుందా? అనే అంశాలపై పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు