రేపు మహిళలకు ఉచిత ప్రవేశం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ మహిళలకు ఓ శుభవార్త చెప్పింది. భారత ఆర్కియాలాజికల్‌ విభాగం పరిధిలో ఉండే అన్ని ప్రాచీన కట్టడాలను రేపు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

Published : 07 Mar 2020 18:36 IST

దిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ మహిళలకు ఓ శుభవార్త చెప్పింది. భారత పురావస్తు విభాగం పరిధిలో ఉండే అన్ని ప్రాచీన కట్టడాలను రేపు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘మార్చి 8న భారత ఆర్కియాలాజికల్‌ విభాగం పరిధిలో ఉండే ప్రాచీన కట్టడాల సందర్శనకు మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు. రేపు ఒక్కరోజు స్త్రీలు వాటిని ఉచితంగా సందర్శించవచ్చు’ అని  మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సం జరుపుకోవడానికి ముందే మన దేశంలో స్త్రీలను పూజించే ఆచారం ఉందన్నారు. స్త్రీలను దేవతలతో పూజించడం మన సంప్రదాయం. ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప ముందడుగు’ అని ఆయన అభివర్ణించారు. ప్రాచీన కట్టడాల వద్ద బేబీ ఫీడింగ్‌ గదుల ఏర్పాటు చేస్తామని మంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని